దేవరకొండ రూరల్, ఆగస్టు 06 : దేవరకొండ మండలంలోని జర్పుల తండాకు చెందిన జర్పుల లచ్చిరాం నాయక్ అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లచ్చిరాం కుటుంబానికి పెద్ద దిక్కు కావడంతో ఆస్పత్రి ఖర్చులకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్‌ను ఆశ్రయించగా స్పందించిన ఆయన రూ.15 వేలు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.