Gadari Kishore | తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తికి చెందిన నిరుపేద విద్యార్థిని బుద్ధ కనకశ్రీకి మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ఆదివారం అండగా నిలిచారు. హైదరాబాద్‌లోని JNTU ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ చదువుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమెకు జేఎన్టీయూ క్యాంపస్‌లో హాస్టల్ ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతుండడంతో ఆమెకు రూ.30వేల నగదు, మరియు Raise India ఫౌండేషన్ ఆర్గనైజర్లు చందన, తిరుమల వేణు నిరుపేద విద్యార్థిని కనక శ్రీకి తక్షణసాయంగా రూ. 1,00,000 విలువైన ల్యాప్‌టాప్‌ను అందజేశారు.