అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. శనివారం రెండో రోజు జిల్లావ్యాప్తంగా 20 నామినేషన్లు దాఖలయ్యాయి. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ రెండు సెట్ల నామినేషన్లు వేశారు. అక్కడే కాంగ్రెస్ అభ్యర్థితో పాటు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. నాగార్జునసాగర్‌లో ముగ్గురు, మిర్యాలగూడలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, నల్లగొండలో ఏఐఎఫ్బీతోపాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. మునుగోడులో సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియాతోపాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, నకిరేకల్‌లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇప్పటివరకు ఆరు నియోజకవర్గాల్లో 31 మంది అభ్యర్థులు 34 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.
నల్లగొండ, నవంబర్ 4: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 3న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తొలి రోజు జిల్లా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజూ శనివారం 20 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలో ఆరు నియో జక వర్గాలు ఉండగా ఆయా ప్రాంతాల్లో సంబంధిత ఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. దేవరకొండలో బీఆర్ఎస్ అభ్యర్థ్ది రమావత్ రవీంద్ర కు మార్ రెండు సెట్ల వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి బాలూనాయక్ ఒకటి, ఒక్క స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖ లు చేశారు.
ఇక నాగార్జునసాగర్‌లో ముగ్గురు స్వతంత్య్ర అభ్యర్థులు, మిర్యాలగూడలో ఇద్దరు స్వతంత్య్ర అభ్యర్థులు, నల్లగొండ లోఏఐఎఫ్బీ నుంచి వడ్డెబోయిన సైదులు, నలుగురు స్వతంత్య్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కర్నాటి వెంకటయ్య గౌడ్ నామినేషన్ వేయగా నలుగురు స్వతం త్య్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. నకిరేకల్ నుంచి ఇద్దరు స్వత ంత్య్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా 13న స్క్రూటినీ చేపట్టనున్నారు. 15న ఉపసంహరణ చేపట్టి అదే రోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి భీ పామ్‌లు ఇచ్చిన వారికి అవే గుర్తులు కేటాయించనుండగా స్వతం త్య్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఎంపిక చేసిన గుర్తులు కేటాయించనున్నారు.