బీబీనగర్, నవంబర్ 7 : కాంగ్రెస్ బూటకపు హామీలతో జనంలోకి వస్తున్నదని, ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు వస్తాయని, బీఆర్ఎస్తోనే మరింత అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని తెలిపారు. అన్ని వర్గాలకు తోడ్పడే విధంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉన్నదని, మరోసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుర్రాలదండి, జంపల్లి, నీలతండా, పెద్దపలుగు తండా, మాధారం, రావిపహాడ్, రావిపహాడ్‌తండా, మగ్దుంపల్లి, గొల్లగూడెంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటికలలు కంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 9 ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నామన్నారు. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడే విధంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉందని తెలిపారు. అనంతరం మండలంలోని గుర్రాలదండిలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ధరావత్ రాజునాయక్‌తో పాటు పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణితాపింగళ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రవికుమార్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
భువనగిరి కలెక్టరేట్ : మండలంలోని అనాజీపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా బీఆర్ఎస్ తాజ్పూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు గులాబీ కండువా కప్పుకున్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు జనగాం పాండు, అనాజీపురం ఎన్నికల ఇన్చార్జి సూరేపల్లి రమేశ్, తాజ్పూర్ సర్పంచ్ బొమ్మారపు సురేశ్, ఓరుగంటి రమేశ్‌గౌడ్, ఆనాజీపురం గ్రామశాఖ అధ్యక్షుడు బత్క అశోక్, అరవింద్ పాల్గొన్నారు.