నకిరేకల్, జూన్ 27: దళితుడు, వికలాంగుడైన ఓ బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే నెపంతో నకిరేకల్ మండలం మంగళపల్లికి చెందిన నందికంటి నాగేంద్రబాబుపై పోలీసులు ఎటువంటి కేసు పెట్టకుండా దాదాపు ఆరు గంటలపాటు నకిరేకల్ పోలీస్టేషన్లో నిర్బంధించారు. తమ పార్టీ కార్యకర్తను అకారణంగా పోలీ స్ స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ మండలపార్టీ అధ్యక్షుడు నవీన్‌రావు, మరికొంతమంది నాయకులతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్న నవీన్‌రావుపై నకిరేకల్ సీఐ రాజశేఖర్ చేయి చేసుకున్నాడు. దీంతో కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దౌర్జ న్యం చేస్తున్నారంటూ పోలీసులతో వాదించడంతో గంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీఆర్ఎస్ కార్యకర్త నందికంటి నాగేంద్రబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై మంగళపల్లికి చెందిన చోటామోటా కాంగ్రెస్ ప్రజాప్రతినిధి పోలీసులకు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నాగేంద్రబాబు ఫోన్ సిగ్నల్‌ను ట్రాప్ చేసి చందుపట్లలో ఉన్నట్లు గుర్తించి శుక్రవారం ఉదయం నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకవచ్చారు. ఆయనపై ఎటువంటి కేసు పెట్టకుండా దాదాపు ఆరుగంటలపాటు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. అకారణంగా ఆయనను పోలీస్టేషన్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ మండలపార్టీ అధ్యక్షుడు నవీన్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదు ట ధర్నాకు దిగారు. దీంతో సీఐ రాజశేఖర్ నవీన్‌రావుపై చేయిచేసుకున్నాడు. దీంతో కార్యకర్తలు, నాయకులు తమ పార్టీ నాయకులపై దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసులతో వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రక్తవాతావరణం నెలకొంది.
తమ పార్టీ కార్యకర్త నాగేంద్రబాబు దళితుడు, వికలాంగుడు అని చూడకుండా ఫోన్ లొకేషన్ సిగ్నల్ ట్రేస్ అవుట్ చేసి మరీ పట్టుకొని స్టేషన్‌కు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై అనవసరమైన కేసులు పెట్టుడు, వేధింపులకు గురిచేసుడు, రోడ్డుపై ధర్నా కు వచ్చినా, బీఆర్ఎస్ జెండా పట్టినా కేసులు పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. సోషల్ మీడియా గ్రూ పులో నాగేంద్రబాబును బెదిరిస్తున్నారని, మంగళపల్లికి వస్తే సంగతేంటో చూస్తామని బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో నకిరేకల్‌లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీఐ ఒక అధికారా..? కాం గ్రెస్ పార్టీ కార్యకర్తనా అని..? ప్రశ్నించారు. పోలీసులు కిరాయి ఉద్యోగుల్లాగా మారారని, బీఆర్ఎస్ కార్యకర్తకు న్యాయం జరగకపోతే తప్పకుండా ప్రతిఘటన ఉంటుందని, ఈ విషయమై జిల్లా ఎస్పీ, డీఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ హెచ్చరించారు. తనకేమైనా జరిగితే బచ్చుపల్లి గంగాధర్రావుదే బాధ్యత అని నాగేంద్రబాబు పేర్కొన్నారు.