రామగిరి, మే 10 : బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ చదివే విద్యార్థులు ఈ నెల 31లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్, రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ కో ఆర్డినేటర్ అంతటి శ్రీనివాసులు శనివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలకు www.braou.ac.inలో గానీ, నల్లగొండలోని కో ఆర్డినేషన్ సెంటర్లో గానీ సంప్రదించాలని సూచించారు.