టేకులపల్లి : మండల కేంద్రంలో జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాలు (Brahmamgari Celebrations) ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రాంగణం మంగళ తోరణాలతో అందంగా ఆలంకరించిన కమిటీ ఆధ్వర్యంలో జెండా ఊరేగింపు నిర్వహించారు.

గోవిందామాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించి , వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవను పురవీధుల గుండా నిర్వహించారు. ఆలయ నిర్వహకులు తౌడోజు భిక్షమయ్య, ధర్మపురి శ్రీనివాసచారి, గజ్జెల రాంశేఖర్, నోముల భాస్కరాచారి, చంద్రగిరి రాధాకృష్ణ, చిలకమర్రి రామకృష్ణ, ధర్మపురి జనార్ధన చారి, అన్నారపు వెంకటేశ్వర్లు, ధర్మపురి వీర బ్రహ్మచారి, కటుకోజ్వాల సురేష్, తదితరులు పాల్గొన్నారు.