చందంపేట(దేవరకొండ), మే 16 : ఎన్నికల ముందు అన్ని రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి రైతులను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సన్న రకం వరి ధాన్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పడంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా దేవరకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికే రైతుబంధు ఇవ్వకపోగా రైతు భరోసా పేరిట కాలయాపన చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు రకం వడ్లను పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా, సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పడం తప్పించుకోవడమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిండి ఎంపీపీ మాధవరం సునీతాజనార్దన్రావు, దేవరకొండ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు వల్లపురెడ్డి, దస్రూనాయక్, లోకసాని తిరుపతయ్య, గాజుల ఆంజనేయులు, గిరిధర్, లింగారెడ్డి, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, బాలయ్య, శంకర్‌నాయక్, నీలా రవికుమార్, వేముల రాజు, కృష్ణ, రమేశ్, లోక్యనాయక్, తులసీరాం, పొట్ట మధు, సత్యనారాయణ పాల్గొన్నారు.
మిర్యాలగూడ టౌన్ : ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని రాష్ట్ర అగ్రోస్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట బోనస్‌పై మాటమార్చిన కాంగ్రెస్ వైఖరి పట్ల మిర్యాలగూడ పట్టణంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో తిప్పన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధ్యంకాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పూటకోమాట మారుస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతురుణమాఫీ ఫైల్ పై సంతకం చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఆగస్టు 15 వరకు చేస్తామని దేవుళ్లపై ఒట్లు చేసే స్థాయికి దిగజారారని తెలిపారు.
ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని మండిపడ్డారు. హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నల్లగొండ డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, దామరచర్ల జడ్పీటీసీ ఆంగోతు లలితాహాతీరాం, పట్టణ మహిళావిభాగం అధ్యక్షురాలు పెండ్యాల పద్మ, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబునాయక్, కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, పాక్స్ మాజీ చైర్మన్ వెలిశెట్టి రామకృష్ణ, నాయకులు యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, కరీం, పునాటి లక్షీనారాయణ, తలకోన శ్రీధర్‌రెడ్డి, సాధినేని శ్రీనివాస్, చాంద్‌పాషా, మన్నెం శ్రీధర్‌రెడ్డి, పశ్య శ్రీనివాస్‌రెడ్డి, అంజన్‌రాజు, గుడిసె దుర్గాప్రసాద్, ఘంట శ్రవణ్‌రెడ్డి, అంజయ్య, కోదాటి రమా తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గురువారం ధర్నా చేపట్టారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నర్రి నరసింహ, గ్రామ శాఖ అధ్యక్షుడు తెలంగాణ భిక్షం, పీఏసీఎస్ డైరెక్టర్ బొడ్డుపల్లి గాలయ్య, నాయకులు వీరమళ్ల జంగయ్య, సిద్దగోని శ్రీను, బోడ రాజు, లక్ష్మారెడ్డి, సుర్వి యాదయ్య, పాండురంగా నాయక్, శ్రీరాముల నరసింహ, వడ్డేపల్లి రాములు, జక్కిడి యాదిరెడ్డి, నలపరాజు రమేశ్, ఉప్పల శ్రీను, రాసాల వెంకటేశ్, బొమ్మగోని రమేశ్ పాల్గొన్నారు.
హాలియా : గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న రకానికి మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడంపై గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా రైతు భరోసా ఇవ్వలేదని, ఇప్పుడు ధాన్యంపై బోనస్ ఇవ్వకుండా మాట మార్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని, హామీలన్నీ నెరవేరే దాకా ఊరుకునేది లేదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు వడ్డె సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హాలియా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, తిరుమలగిరి సాగర్, నిడమనూరు బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు పిడిగం నాగయ్య, తాటి సత్యపాల్, ఎంపీటీసీ వెంకటయ్య, బొమ్మిశెట్టి ఆంజనేయులు, సురబి రాంబాబు, వర్రా వెంకట్‌రెడ్డి, నాయకులు మెండె సైదులు, కేశబోయిన శంకర్, బొల్లేపల్లి రమణరాజు పాల్గొన్నారు.