కట్టంగూర్, మే 15 : నల్లగొండ జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పోలీసు అధికారి (వీపీఓ) గా కట్టంగూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్, బొల్లెపల్లి గ్రామ పోలీసు అధికారిగా పనిచేస్తున్న బోడ వెంకటేశ్వర్లు అవార్డు అందుకున్నారు. సమర్థవంతంగా బొల్లెపల్లి గ్రామ పోలీస్ అధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సత్కరించి అవార్డు కింద నగదు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన వీపీఓ వ్యవస్థ ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఈ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
ఉత్తమ అవార్డు అందుకున్న వెంకటేశ్వర్లను కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విధి నిర్వహణలో తనకు సహకరించిన బొల్లెపల్లి గ్రామస్తులు, నల్లగొండ డీఎస్పీ కొలను శివరాం రెడ్డి, నకిరేకల్ రూరల్ సీఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ రవీందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.