NZ vs UAE | ఓపెనర్లే కొట్టేశారు.. పది వికెట్లతో యూఏఈని ఓడించిన న్యూజిలాండ్..!
NZ vs UAE : వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లో భారత జట్టు చేతిలో చావుదెబ్బ తిన్న న్యూజిలాండ్ మెగా టోర్నీలో జూలు విదుల్చుతోంది. తొలిపోరులో అఫ్గనిస్థాన్ స్పిన్ ఉచ్చును ఛేదించిన కివీస్.. ఈసారి యూఏఈ భరతం పట్టింది.
NZ vs UAE : వరల్డ్‌కప్ సన్నాహక సిరీస్‌లో భారత జట్టు చేతిలో చావుదెబ్బ తిన్న న్యూజిలాండ్ మెగా టోర్నీలో జూలు విదుల్చుతోంది. తొలిపోరులో అఫ్గనిస్థాన్ స్పిన్ ఉచ్చును ఛేదించిన కివీస్.. ఈసారి యూఏఈ భరతం పట్టింది. 174 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఓపెనర్లు ఓపెనర్లు టిమ్ సీఫర్ట్(89 నాటౌట్), ఫిన్ అలెన్(84 నాటౌట్) మంచుముక్కలా కరిగించారు. హైలెట్స్ చూస్తున్నామా? అన్నట్టుగా రెండో ఓవర్ నుంచి దూకుడే మంత్రగా యూఏఈ బౌలర్లపై ఈ ద్వయం విరుచుకుపడింది. అర్ధ శతకాల అనంతరం మరింత రెచ్చిపోయిన సీఫర్ట్, అలెన్ ప్రత్యర్థి బౌలర్లపై జాలి, దయ లేకుండా ఆడడంతో మరో26 బంతులు మిగిలి ఉండగానే మట్టికరిపించింది.
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం సృష్టించాలనుకున్న యూఏఈ కలలు కల్లలయ్యాయి. పటిష్టమైన న్యూజిలాండ్‌పై భారీ స్కోర్‌తో విజయంపై ఆశలు పెట్టుకున్న ఆ జట్టుపై ఓపెనర్లు టిమ్ సీఫర్ట్(89 నాటౌట్), ఫిన్ అలెన్(84 నాటౌట్) పిడుగల్లే విరుచుకుపడ్డారు. 174 పరుగుల ఛేదనలో నువ్వానేనా అనట్టు ఇద్దరూ పోటీపడి బౌండరీల పండుగ చేసుకున్నారు. రోహిద్ ఖాన్ వేసిన 6వ ఓవర్లో సీఫర్ట్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 రన్స్ రాబట్టగా.. పవర్ ప్లేలోనే 80కి చేరువైంది కివీస్.
A 10-wicket win for New Zealand against UAE as openers Tim Seifert & Finn Allen polish off the 174 target in just 15.2 overs 💥
👉 https://t.co/GLAM2NnEdy pic.twitter.com/UBhzLWU2SP
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026
ఈ జోడీని విడదీసేందుకు యూఏఈ సారథి వసీం బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. స్వీప్ షాట్లు, ఫ్లిక్స్, కట్ షాట్లతో అలరించిన సీఫర్ట్, అలెన్ ఏ దశలోనూ ఔటయ్యేలా కనిపించలేదు. దాంతో.. చూస్తుండగానే లక్ష్యం చిన్నదైపోయింది. రోహిద్ వేసిన 16 వ ఓవర్ రెండో బంతిని సీఫర్ట్ సిక్సర్‌గా మలవగా బ్లాక్ క్యాప్స్ 10 వికెట్లతో జయభేరి మోగించింది. వరుసగారెండో విజయంతో మిచెల్ శాంట్నర్ బృందం గ్రూప్ డీలో అగ్రస్థానానికి ఎగబాకింది.
వసీం, షరాఫు దంచేయగా..
చెన్నైలో పటిష్టమైన న్యూజిలాండ్‌కు మొదట యూఏఈ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్ ముహమ్మద్ వసీం(64 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా.. అలీషన్ షరాఫు(55) హాఫ్ సెంచరీతోచెలరేగాడు. కివీస్ పేస్, స్పిన్ దళాన్ని ఉతికారేసిన ఈ ద్వయం విధ్వంసంతో 15 ఓవర్లకే స్కోర్ 120 దాటింది. ఆఖర్లో మయాంక్ కుమార్(21) దంచేశాడు. చివరి ఓవర్లో మరిన్ని పరుగులు రాబట్టాలనకున్న ప్రత్యర్ధికి షాకిస్తూ మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీశాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో యూఏఈ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

