తాండూర్, ఫిబ్రవరి 10 : బుగ్గ దేవాలయ రికార్డులు తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి మార్చి దేవాలయాన్ని తాండూర్ మండల పరిధిలోకి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మంగళవారం తహసిల్దార్ జ్యోత్స్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్షలఘట్టం గ్రామ సమీపంలోని బుగ్గ దేవాలయం రికార్డులు మొత్తం తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ, తాండూర్ తహసీల్దార్ కార్యాలయం పరిధిలో ఉన్నందున రికార్డుల ప్రకారం బుగ్గ దేవాలయం కూడా తాండూర్ పరిధిలోకి వస్తుందని తెలియజేశారు.
కన్నాల పరిధిలో ఉన్న ఈ దేవాలయాన్ని ఆక్కడ రికార్డుల నుంచి తొలగించి తాండూర్ రెవెన్యూ రికార్డుల ప్రకారం తాండూర్ పరిధిలోకి తీసుకోవాలని వారు కోరారు. వినతిపత్రం అందజేసినవారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు, దత్తాత్రేయరావు, మాసాడి శ్రీరాములు, బోనగిరి చంద్రశేఖర్, ఎలుక రామచందర్, భీమ లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.