చిట్యాల, మార్చి 22 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపింది. గ్రామ శివారులోని కోళ్ల ఫామ్లో గల కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ కావడంతో పశు సంవర్థక శాఖ అధికారులు కోళ్ల ఫామ్లో పరీక్షలు నిర్వహించారు. కోళ్ల ఫారంలో దాదాపు 2 లక్షల కోళ్లు ఉండగా 20 వేల కోళ్లకు వ్యాధి సోకిందని నిర్ధారించారు. దీంతో అధికారులు మిగతా కోళ్లను కూడా చంపివేసి కోళ్ల ఫారం ఆవరణలోనే గోతి తీసి పాతిపెట్టారు. గుండ్రాంపల్లితో పాటు చుట్టు పక్కల అన్ని కోళ్ల ఫారాలను పరిక్షించనున్నట్లు తెలిపారు.