నేరేడుచర్ల, జూలై 18 : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన పిల్లలమర్రి కావేరికి గురువారం బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రాపోలు నవీన్‌కుమార్ సైకిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్‌బాబు రూ.5 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కావేరి తండ్రి, సోదరుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిపారు. నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిత్యం నడుచుకుంటూ వెళ్తున్న విషయం తెలుసుకుని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుక సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా విద్యార్థిని నగదు, సైకిల్ బహుకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లెపంగ నాగరాజు, మాజీ ఎంపీటీసీ ఎల్లబోయిన లింగయ్య, ముస్లిం మైనార్టీ పట్టణాధ్యక్షుడు ఎండీ హుస్సేన్, మహిళా నాయకురాలు ఖైరాబీ, పెద్దపంగ ఉపేందర్, సుదర్శన్, సతీశ్ పాల్గొన్నారు.