హుజూర్నగర్, జూన్ 28: ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చం దర్ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వారసత్వంగా వచ్చిన భూమి ని తన పేరున మ్యుటేషన్ చేయించారు. ఆ రైతుకు ప్రొసీడింగ్ ప్రతాలు అందించేందుకు భూభారతి ఆపరేటర్ విజేతారెడ్డి రూ.20వేలు డిమాండ్ చేయగా అంత ఇచ్చుకోలేనని చెప్పి ఎకరానికి రూ.వెయ్యి చొప్పున రూ.12వేలకు ఒప్పుకొన్నారు.
అనంతరం రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రైతు, ఆపరేటర్‌కు డబ్బులు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్నట్లు రసాయన పరీక్షలో కూడా రుజువు కావడంతో నిం దితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పర్చేందుకు అదుపులోకి తీసుకున్నామన్నారు.