నల్లగొండ, జూలై 04 : నల్లగొండ జిల్లాకు చెందిన బసిరెడ్డి అన్విత్ రెడ్డి పశ్చిమ యూరప్ లోని లక్సెంబర్గ్ దేశంలో లక్సెంబర్గ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ చదువుతూ ఆ దేశంలో పల్స్ అనే ఆర్గనైజేషన్‌కు ఇండియన్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, తెలంగాణ యూత్ ఐకాన్ కల్వకుంట్ల తారక రామారావును, అలాగే మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్‌లో లక్సెంబర్గ్‌లో జరగబోయే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై కేటీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్విత్ రెడ్డిని కేటీఆర్, జగదీశ్‌రెడ్డి అభినందించారు.