నల్లగొండ రూరల్, జనవరి 27 : బ్యాంకింగ్ రంగంలో వారంలో ఐదు పని దినాల విధానంను అమలు చేయాలనే డిమాండ్ సాధనకై చేపట్టిన దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఎదుట నిరసన చేయగా, జిల్లా కేంద్రంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు ఎన్జీ కళాశాల నుండి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్లో గల ఎస్బీఐ బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ ఉద్యోగులు అధిక పని భారం, సిబ్బంది కొరత, పెరుగుతున్న మానసిక ఒత్తిడితో పని చేస్తున్నారన్నారు.
ప్రభుత్వం, బ్యాంక్ యజమాన్యాలు బ్యాంక్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకుని ఐదు రోజుల పని దినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమ్మె విజయవంతం చేయడానికి బ్యాంక్ ఉద్యోగులందరూ ఐక్యంగా పాల్గొని, తమ హక్కుల సాధనకై పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో వివిధ బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు కరుణాకర్ రెడ్డి, రాజు, అలీముద్దీన్, సుగుణ కుమార్, మల్లికార్జున్ రెడ్డి, రవిచంద్ర, నర్మదా, కురువా నాయక్, కత్తుల ఈశ్వర్, సుమన్, శ్రామిక్, యాదయ్య, జీవన్, నరసింహ, దిలీప్, ప్రవీణ్, రాజు, శివ ప్రియాంక, సంధ్య, సతీష్ రెడ్డి, యుగంధర్, రామ్మోహన్, శ్రవణ్ పాల్గొన్నారు.

Nalgonda Rural : నల్లగొండలో బ్యాంక్ ఉద్యోగుల నిరసన