పెన్పహాడ్, జూలై 16 : సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల ఎంపీడీఓగా బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన వెంకటేశ్వరరావు నల్లగొండకు బదిలీ అయ్యారు. సూర్యాపేట ఎంపీడీఓగా విధులు నిర్వహించిన బాలకృష్ణ బదిలీపై పెన్పహాడ్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.