దేవరకొండ రూరల్, జూన్ 06 : భక్తికి, త్యాగానికి, సహనానికి బక్రీద్ పండుగ ప్రతీక అని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.