‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో...
– నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి
కట్టంగూర్, నవంబర్ 12 : నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భావితరాలకు నీటి వనరులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలని, ఆయిల్‌పామ్ సాగు, సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించాలని కోరారు. గ్రామాల్లో విద్యుత్ వృథాను అరికట్టేందుకు విద్యుత్ స్తంభాలకు ఆన్–ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, పశువుల తొట్టెలు నిర్మించి పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సమావేశంలో చదివి వినిపించారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో గంట అంజన్ రెడ్డి, తాసీల్దార్ పుష్పలత, ఏవో గిరిప్రసాద్, ఏపీఓ కడెం రామ్మోహన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిరీష, ఏపీఎం నరహరి, హౌసింగ్ ఏఈ అరుణ, ట్రాన్స కో ఏఈ హుస్సేన్, ఐసీడీఎస్ సీడీపీవో అస్రా అంజుమ్, ఐబీ ఏఈ రాజశేఖర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజు, ఎంఈఓ అంబటి అంజయ్య, సర్పంచులు దార సత్తెమ్మ, ఎన్న మౌనిక, తోటకూరి జలజ, వల్లపు శ్రీనివాస్ రెడ్డి, తేలు సత్తయ్య, కురిమిళ్ల మల్లేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
AP News | ఏపీలోని 23 లోకల్ బాడీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

