అర్వపల్లి, అక్టోబర్ 13 : అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం గుండె, ఊపిరితిత్తుల పునర్జీవన (CPR ) పై తాసీల్దార్ కార్యాలయం అలాగే పీహెచ్సీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ నాయక్ మాట్లాడుతూ.. ప్రతి వంద మరణాల్లో పది మరణాలు ఆకస్మికంగా గుండెపోటు సమస్యతో మరణిస్తున్నారని, ఎవరైనా గుండె సమస్యతో మరణించినట్లయితే, అక్కడ ఉన్నవారు తక్షణం స్పందించి గుండె, ఊపిరితిత్తుల పునర్జీవనం (CPR ) చేస్తే బ్రతికే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఆహార అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండెపోటు వస్తుందని, కావునా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి, సామాజిక ఆరోగ్య అధికారి బిచ్చు నాయక్, సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు సునీత, కళమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.