నీలగిరి, నవంబర్ 18 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పలు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నిషా ముక్త్ భారత్ దివస్ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులు ప్రజలకు తెలియచేసి ఆరోగ్య భారత్ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్లు పార్వతి, జయమ్మ, సరస్వతి, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.