చండూరు, ఆగస్టు 19 : చండూరు మండల పరిధిలోని బంగారిగడ్డ గ్రామానికి చెందిన సుంకరి యాదగిరి పత్తి చేనులో మంగళవారం నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు నానో యూరియా, నానో డీఏపీ పంట దిగుబడి పెంచడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు. అంతే కాకుండా రైతులకి ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని తెలిపారు. కావున రైతులందరూ పర్యావరణ క్షేమం కోసం, వారి ఆర్థిక ఉన్నతికి నానో యూరియా, డీఏపీ వాడాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు అనూష, పద్మజ, ఇఫ్కో సిబ్బంది శంకర్, రైతులు సుంకరి మారెమ్మ, నర్సింహ, రాములు పాల్గొన్నారు.