‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
వినియోగదారుల హక్కులు, సమస్యల పరిష్కారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని నల్లగొండ జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్ఓ) టి.వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని డీసీఐసీ కార్యాలయంలో...
– డీసీఎస్ఓ వెంకటేష్
రామగిరి, అక్టోబర్ 12 : వినియోగదారుల హక్కులు, సమస్యల పరిష్కారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినియోగదారుల సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని నల్లగొండ జిల్లా పౌర సరఫరాల అధికారి (డీసీఎస్ఓ) టి.వెంకటేష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని డీసీఐసీ కార్యాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు అన్నెబోయిన మట్టయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించగా, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ వినియోగదారుల హక్కుల కోసం కృషి చేస్తున్న సంఘాల ప్రతినిధులను అభినందించారు. క్యాట్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు వినియోగదారుల సొసైటీల సంక్షేమ నిధికి సంబంధించి నీతి రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా మాజీ అధ్యక్షుడు స్వర్గీయ ఎ.హిమగిరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో పలువురు వినియోగదారుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

