బీసీ రుణాల పంపిణీకి రంగం సిద్ధం
బీసీ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇకపై నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రతి నెలా పంపిణీ చేయనున్నారు.
- ప్రతి నెలా నియోజక వర్గానికి 300 మందికి రూ.లక్ష సాయం
- నేటి నుంచి 25 వరకు అందజేత
- జిల్లాలో 40,810 దరఖాస్తులు.. 38,648 మంది అర్హుల గుర్తింపు
- దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇప్పటికే ప్రారంభమైన కార్యక్రమం
- నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్న ఎమ్మెల్యేలు
నల్లగొండ, జూలై 14 : బీసీ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇకపై నియోజకవర్గానికి 300 మందికి చొప్పున ప్రతి నెలా పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 40,810 దరఖాస్తులు రాగా 38,648 మంది అర్హులను అధికారులు గుర్తించారు. శనివారం ఆయా నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీని ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు.
నల్లగొండ, జులై 14: బీసీ కులాల్లో కుల వృత్తులపై ఆధార పడిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. గత నెలలో ప్రకటించిన ప్రభుత్వ సూచన ప్రకారం బీసీ కులాల వారు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఈ రుణాలు ఇచ్చే విధంగా బీసీ శాఖ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నియోజ కవర్గాల్లో ఎమ్మెల్యేలు రుణాలు అందజేయ న్నారు.
నియోజక వర్గంలో 300 మందికి రుణాలు…
కుల వృత్తులకు రుణాలు అందచేసి వారి పనిముట్లు కొనుగోలు చేసుకోవడానికి సహాయ పడాలనే ఆలోచనతోరాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం జిల్లాలో శనివారం నుంచి అర్హులకు అందనుంది. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 40,810 మంది దరఖాస్తులు చేసు కోగా అందులో 38,648 మంది అర్హులుగా గుర్తించి శనివారం నుంచి ప్రతి నెల 15 నుంచి 25 వరకు ఇచ్చే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడుతలో నియోజకవర్గానికి 50 మంది చొప్పున ఇవ్వగా రెండో విడుతలో 300 మంది చొప్పున జిల్లాలో 1800 మందికి రూ.18 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఇచ్చే ఈ రుణాలు లబ్ధిదారులకు అందిన తర్వాత పనిముట్ల కొనుగోలు సమయంలో బీసీ శాఖ అధికారులు గ్రౌండింగ్ చేయనున్నారు.
ఈ నెల 25వరకు అందజేస్తాం
బీసీ కులాల్లోని 15 కులాల వారికి ప్రభుత్వం రూ.లక్ష చొప్పున రుణం ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో 40వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో 38 మందిని అర్హులుగా గుర్తించాం. వారికి శనివారం నుంచి ఈ నెల 25 వరకు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లక్ష రూపాయల రుణం అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెలా ఇదే సమయంలో ఈ రుణాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఖాజా నాజీమ్ అలీ అఫ్సర్, బీసీడీడీ,నల్లగొండ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

