కోదాడ, ఆగస్టు 01 : నీట్ పీజీ ప్రవేశ పరీక్షకి ఏర్పాట్లు పూర్తి అయినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. శుక్రవారం కోదాడ లోని సన ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన నీట్ పీజీ పరీక్ష ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 3వ తేదీ ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్ష నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఉదయం 7:00 గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతిస్తారని వెల్లడించారు. సన ఇంజినీరింగ్ కళాశాల నందు 50 మంది, సూర్యాపేట ఎస్ వి ఇంజినీరింగ్ కళాశాల నందు 180 మంది అభ్యర్డులు పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, తాసీల్దార్ వాజీద్ అలీ, కాలేజీ ప్రిన్సిపాల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.