రామగిరి, ఆగస్టు 13 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో గల పలు దేవాలయాలకు నూతన ధర్మకర్తల మండళ్ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నెపర్తి సులోచన తెలిపారు. ఆసక్తి గల వారు 20 రోజుల్లోగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ నల్లగొండ, హైదరాబాద్ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఆయా దేవాలయాల ఈఓ, జిల్లా దేవాదాశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో తెలుసుకోవచ్చని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.