రామగిరి, సెప్టెంబర్ 23 : డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అకడమిక్ కౌన్సిలర్స్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ నల్లగొండ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ అధ్యయన కేంద్రాల్లో కాంట్రాక్ట్ కమ్ కౌన్సిలింగ్ తరగతులు బోధించుటకు కౌన్సిలర్స్ నియామకం చేస్తున్నట్లు వెల్లడించారు.
బోధన అనుభవం, పీహెచ్డీ, నెట్, సెట్, పీజీ సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం మార్కులు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. నిర్దేశిత అర్హతలు కలిగిన అకడమిక్ కౌన్సిలర్స్ విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.braouonline.in లో అక్టోబర్ 10వ తేదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్లో సంప్రదించాలన్నారు.