సూర్యాపేట, ఏప్రిల్ 26 : సూర్యాపేట జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత వేసవి క్రీడల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామచంద్రరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 01 నుండి జూన్ 06 వరకు బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్ క్రీడలనందు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 10 గ్రామీణ ప్రాంతాల్లో అలాగే 02 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 12 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
1). తుంగతుర్తి మండలంలోని జడ్పీహెచ్ఎస్ వెంపటి నందు కబడ్డీ క్రీడలో శిక్షణ
2). చిలుకూరు మండలంలోని జడ్పీహెచ్ఎస్ చిలుకూర్ నందు కబడ్డీ, అలాగే జడ్పీహెచ్ఎస్ పాలే అన్నారంలో వాలీబాల్ నందు శిక్షణ ఇవ్వబడును.
3). నడిగూడెం మండలంలో జడ్పీహెచ్ఎస్ నడిగూడెం నందు కబడ్డీ
4). కోదాడ మండలంలోని జడ్పీహెచ్ఎస్ కూచిపూడి నందు ఖోఖో అలాటే జడ్పీహెచ్ఎస్ గుడిబండలో వాలీబాల్ శిక్షణ
5). సూర్యాపేట మండలంలోని జడ్పీహెచ్ఎస్ యండ్లపల్లి నందు ఖోఖో, జడ్పీహెచ్ఎస్ టేకుమట్లలో వాలీబాల్
6). జాజిరెడ్డిగూడెం మండలంలోని జడ్పీహెచ్ఎస్ అర్వపల్లిలో వాలీబాల్
7). మేళ్లచెరువు మండలలోని జడ్పీహెచ్ఎస్ మేళ్లచెరువులో వాలీబాల్
8). సూర్యాపేట మున్సిపాలిటిలోని పిల్లలమర్రిలో అథ్లెటిక్స్ నందు శిక్షణ
9). కోదాడ మున్సిపాలిటీలోని కోమరబండలో వాలీబాల్ నందు శిక్షణ ఇవ్వబడును.
శిక్షణలో పాల్గొనదలచిన వారు https://satgasc.telangana.gov.in వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోపు పేర్లను నమోదు చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత శిక్షణలు ఇవ్వబడును. పట్టణ ప్రాంతాల్లో పాల్గొను వారు నిర్దేశించిన రుసుము చెల్లించవలయును. ఇతర వివరాలకు 9000491112 నంబర్‌కు సంప్రదించగలరు.