రామగిరి, జూలై 26 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, నల్లగొండ యందు వివిధ కోర్సులో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. పవిత్ర వాణి కర్ష శనివారం తెలిపారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
MPC : SC-5;
MPCS : – SC-1, ST-2;
MSCS : – SC-2, ST-2, MINORITY-1;
MZC : SC-8, ST-2;
B.COM(CA) -SC-6, ST-2
B.COM(BA) : SC-7, ST-1
BA(HEP) – SC-10, MINORITY -1
ఈ నెల 31వ తేదీ లోపు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, క్యాస్ట్, ఇన్కమ్, టి.సి ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు సమర్పించి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. కళాశాలలో నాణ్యమైన విద్య, ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు పై చదువుల కోసం అలాగే ఉద్యోగ సంబంధిత పరీక్షలకు తగిన కోచింగ్ ఇవ్వబడును కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అడ్మిషన్స్ కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 86391 09606, 90002 29058.