నీలగిరి. జూన్ 17 : అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుందని ఐసీడీఎస్ సుపర్వైజర్ జయమ్మ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఇందిరానగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అమ్మ మాట -అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 నెలల నిండిన చిన్నారులందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పుష్పాలత, శారద, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.