రామగిరి, సెప్టెంబర్ 01 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరంలో యూజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అడ్మిషన్ల గడువును ఈ నెల 12వ తేదీ వరకు యూనివర్సిటీ పొడిగించినట్లు వర్సిటీ నల్లగొండ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ సోమవారం తెలిపారు. అదేవిధంగా యూజీ, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్ ఫీజులను ఇదే గడువులోగా చెల్లించవచ్చన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తులను పూర్తి చేసి ఫీజులు చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.braou.ac.in లో గాని లేదా నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో గల రీజనల్ కో ఆర్డినేషన్ సెంటర్లో గాని లేదా 9533101295,.. 7989339180 ఫోన నంబర్స్ లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.