ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో సందడి చేశారు. బట్టుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆయన మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి నిర్మించిన కంచర్ల కన్వెషన్ హాల్‌ను ఫ్యామిలీతో కలిసి శనివారం ప్రారంభించారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు.
పెద్దవూర ఆగస్టు 19 : మండలంలోని బట్టుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తగూడెం(ముసలమ్మచెట్టు ) గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల నిర్మించిన కంచర్ల కన్వెన్షన్ హాల్‌ను ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఫ్యామిలీతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర జల సౌకర్యార్థం మారుమాల ప్రాంతంలో ఇంత కన్వెన్షన్ హాల్ నిర్మించినందుకు మామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో సైతం నాగార్జునసాగర్ నియెజకవర్గంలో మరెన్నో సేవా కార్యక్రమలు చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ పెద్దవూర మండల కేంద్రం నుండి సుమారు 5కిలో మీటర్లు బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి 10వేల మందికి అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పుట్టిన గడ్డకు భవిష్యత్‌లో అన్ని విధాలుగా సహాయ పడుతానని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన గురవయ్య యాదవ్, పెద్దవూర ఎంపీపీ చెన్ను అనూరాధాసుందర్రెడ్డి, నాయకుడు వర్రె వెంకట్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.