పెన్పహాడ్, ఆగస్టు 11 : పిల్లల్లో నులి పురుగుల నివారణకు ఆల్బండజోల్ మాత్రలు తప్పని సరిగా వేయాలని పెన్పహాడ్ మండల తాసీల్దార్ లాలూ నాయక్, ఎంపీడీఓ జానయ్య, వైద్యాధికారి రాజేశ్ అన్నారు. సోమవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
నులి పురుగుల ప్రభావంతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, విరేచనాలు బరువు తగ్గడం గ్రహించవచ్చన్నారు. నులి పురుగులతో పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడుతుందని, విషయ సంగ్రహణ దెబ్బతింటుందన్నారు. తద్వారా వారి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవి. ఆనంతలక్ష్మి, కృష్ణ ప్రసాద్, వెంకన్న, వీరమ్మ, వెంకటరమణ పాల్గొన్నారు.