కోదాడ, డిసెంబర్ 19 : కోదాడ పబ్లిక్ క్లబ్ అభివృద్ధిలో అక్కిరాజు వెంకట్రావు చేసిన సేవలు చిరస్మరణీయమని క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గాయం పట్టాభిరెడ్డి, బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన క్లబ్ శాశ్వత సభ్యుడు అక్కిరాజు వెంకట్రావు చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్లబ్ అభివృద్ధికి వెంకట్రావు చేసిన సేవలను స్మరించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ చింతలపాటి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఓరుగంటి రవి, మేకల వెంకటరావు, హరిబాబు, చింతలపాటి శ్రీను, పోటు రంగారావు, వేనేపల్లి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.