మునుగోడు, మార్చి 23: భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పురి వెంకటేశ్వర్లు అన్నారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమి వేసేందుకు తన ప్రాణాలను బలిదానం చేసిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని కొనియాడారు. దేశంలో యువత సంక్షేమం ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర యువజన విధానాన్ని రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. మునుగోడు నియోజకవర్గంలో నెలకొల్పుతున్న విషపూరిత హాని కలిగించే రసాయన పరిశ్రమల అనుమతులకు వ్యతిరేకంగా యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉప్పర బోయిన సతీష్, బండారు శంకర్, మండల కార్యదర్శి చాపల శ్రీను, దుబ్బ వెంకన్న, తిరందా శ్రీనివాస్ ,జిల్లా కమిటీ సభ్యులు పుల్కరం ఆంజనేయులు, గోస్కొండ మల్లేష్, చాపల విప్లవ కుమార్, బొలుగురి వంశీ, పగిళ్ల బాబు, జి రాము, ఏ నాగరాజు తదితరులు పాల్గొని నివాళులర్పించారు