‘నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండలో అగ్రి షో’
అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో అగ్రి షో నిర్వహించనున్నట్లు రైతు సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి...
– 300 కంపెనీల స్టాళ్లు
– రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన
– రైతు సంఘం జాతీయ నాయకులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి
రామగిరి, అక్టోబర్ 27 : అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో అగ్రి షో నిర్వహించనున్నట్లు రైతు సంఘం జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం అగ్రి షో నిర్వహించే పాత ఐబీ, ఆర్అండ్బీ కార్యాలయాల స్థలాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు అగ్రి షో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సుమారు 300 కంపెనీలు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నాయని, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవాలని కోరారు. నవంబర్ 15న జాతీయ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, కట్టా నరసింహ, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ఎం.డి. సలీం, దండెంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, గాదె నరసింహ, వెంకట్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

