రామగిరి, ఏప్రిల్ 15 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, చర్లపల్లి, నల్లగొండ యందు 2026-27 సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమైనవని కళాశాల ప్రిన్సిపాల్ డా.పవిత్ర వాణి కర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో బి.ఎ (హెచ్.ఈ.పి) బీకాంలో కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో ఎం.పి.సి, ఎం.పి.సి.ఎస్, ఎంఎస్సిఎస్, ఎం.ఎస్.డి.ఎస్, బి.జెడ్.సి, ఎం.జెడ్.సి గ్రూపులో అడ్మిషన్స్ కోసం ఆసక్తి గలవారు తమ టెన్త్, ఇంటర్ మార్క్స్ మెమోలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తో కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు. వివరాల కోసం 9000229058 / 8099524949 నెంబర్లను సంప్రదించాలన్నారు.