ఆలేరు టౌన్, జూన్ 12: ఆలేరు పట్టణ కేంద్రంలోని దినేశ్ గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మహిళా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఫొటో వివాదం చర్చనీయాంశంగా మారింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి ఫొటో లేదని అసంతృప్తి చెందారు. సమావేశం మధ్యలో నుంచి ఆమె వెళ్లిపోవడంతో తోటి మహిళలు ఆవేదన చెందారు.
కాంగ్రెస్ మహిళా ప్రతినిధిగా.. ఆలేరు ప్రథమ మహిళకు కాంగ్రెస్ న్యాయం చేయకపోతే మిగతా మహిళలకు ఏం న్యాయం చేస్తుందని చర్చించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే వేరే సమావేశానికి వెళ్లగానే అక్కడి నుంచి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్యకర్తలు వెళ్లిపోయారు. ఈ అంశం వివిధ రాజకీయా పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. సమావేశానికి వచ్చిన మహిళలకు సరైన సమయానికి భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.