నీలగిరి, డిసెంబర్ 9: పోలీస్ ఉద్యోగాల కోసం నల్లగొండ మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహి స్తున్న దేహధారుడ్య పరీక్షలు రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. అవతవకలు జరుగకుండా ప్రత్యేక అధికారి శబరీస్ స్వయంగా పర్యవేక్షించారు. రెండో రోజు రన్నింగ్‌లో 800 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 134 మంది గైర్హాజరైనట్లు పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు. మిగిలిన 666 మంది అభ్యర్థుల్లో కేవలం 273 మంది ఫైనల్ రాత పరీక్షకు అర్హత సాధించారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో బయో మెట్రిక్, ఆర్ఎఫ్ఐడీ డిజిటల్ విధా నంలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండా పోలీస్ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు.
గుత్తా వెంకట్‌రెడ్డి మెమెరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోషకాహారం పంపిణీ
గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థు లకు పోషకాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కంచర్లకుంట్ల గోపాల్‌రెడ్డి, నాగులంచ వెంకటేశ్వర్రావు. రిటైర్డ్ వార్డెన్ల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఉన్నారు.