నేరేడుగొమ్మ, ఏప్రిల్ 13 : నేరేడుగొమ్మ మండలం కచరాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఊరపాయతండాలో రామావత్ హనుమా S/O బిచియా కు చెందిన దొడ్డిలో మూడు రోజుల వ్యవధిలో అంతు చిక్కని రోగంతో సుమారు 50 గొర్రెలు చనిపోవడం జరిగింది. సుమారు రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. గొర్రెలను పొలంలోనే వదిలేసి కుటుంబ సభ్యులు విలపించారు. మారుమూల ప్రాంతానికి ప్రభుత్వం వైద్యం అందించి, రైతును వెంటనే ఆదుకోవాని స్థానికులు కోరుతున్నారు.