నందికొండ, ఆగస్టు 29 : నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,57,634 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండడంతో గురువారం సాగర్ డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,10,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ ద్వారా 8,280 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 9,274 క్యూసెక్కులు, జలవిద్యుత్ కేంద్రం ద్వారా 27080, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800, వరద కాల్వ ద్వారా 600 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312.50 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రసుత్తం పూర్తిస్థాయిలో నీరుంది.