సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Jan 21, 2021 , 01:26:29

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

కొండమల్లేపల్లి, జనవరి 20 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని దేవరోనితండా గ్రామం నుంచి నల్లగొండ రోడ్డు వరకు ఎస్టీఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.82 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు, గుమ్మడవెల్లిలో గ్రంథాలయ భవన నిర్మాణానికి, రూ.3 లక్షలతో ముస్లింల శ్మశానవాటిక పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. రూర్బన్‌ నిధులు రూ.8లక్షలతో నిర్మించిన ఈ-పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, వైస్‌ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ మేకల శ్రీను, పసునూరి యుగేంధర్‌రెడ్డి, సర్పంచులు ఇస్లావత్‌ రాకేశ్‌నాయక్‌, గుండెబోయిన లింగంయాదవ్‌, దస్రూ, భీంసింగ్‌, రమేశ్‌నాయక్‌, బద్దు, దీప్లా, రాములు, ముక్కామళ్ల రాజలింగం, పంగ యాదయ్య, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.

VIDEOS

logo