గురువారం 04 మార్చి 2021
Nalgonda - Dec 27, 2020 , 00:30:31

విశిష్ట సాహితీ విమర్శకుడు డాక్టర్‌ నోముల సత్యనారాయణ

విశిష్ట సాహితీ విమర్శకుడు డాక్టర్‌ నోముల సత్యనారాయణ

  • ‘నోముల సాహితీ ముచ్చట్లు’ పుస్తకావిష్కరణ

నల్లగొండ కల్చరల్‌ : తెలుగు సాహిత్యంలో విశిష్టమైన సాహితీ విమర్శకుడు డాక్టర్‌ నోముల సత్యనారాయణ అని ప్రముఖ సామాజిక విశ్లేషకుడు ఎస్‌.వేణుగోపాల్‌ అన్నారు. ఎన్జీ కళాశాలలో శనివారం నోముల సాహిత్య సమితి ఆధ్వర్యంలో డాక్టర్‌ పెన్నా శివరామకృష్ణ సంపాదకత్వంలో ‘నోముల సాహితీ ముచ్చట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్యవాదంలో వాస్తవికతపై సమగ్ర విమర్శ చేసిన నోముల సత్యనారాయణ నేటితరం విమర్శకులకు దీప శిఖవలె దారి చూపారన్నారు. వాద, వివాదాలకు, ప్రాంతీయ బేధాలకు అతీతంగా సాహిత్యాన్ని తన విమర్శలో తూచారని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్‌ఎస్‌ రాహుల్‌, ఎలికట్టె శంకర్‌రావు, ఎంవీ గోనారెడ్డి, మునాస్‌ వెంకట్‌, డా. పగడాల నాగేందర్‌, తండు కృష్ణకౌండిన్య, సత్తయ్య, ఆనంద్‌ నోముల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


VIDEOS

logo