శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 20, 2020 , 02:30:40

ట్రాక్టర్ల కొనుగోళ్లు పూర్తి చేయాలి

ట్రాక్టర్ల కొనుగోళ్లు పూర్తి చేయాలి


నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పంచాయతీరాజ్‌, రవాణాశాఖ, ఆయా ట్రాక్టర్ల డీలర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ట్రాక్టర్లు కొనుగోలు పూర్తయిన ప్రాంతాల్లో ట్రాలీలు, ట్యాంకర్లను కొనుగోలు చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 530 గ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోలు పూర్తయినందున మరో 300 గ్రామాల్లో ఈ నెలాఖరులోగా పూర్తి చేయడానికి వాటిని సరఫరా చేయాలని డీలర్లను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ అనుమతులను సైతం ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని రవాణాశాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు. ట్యాంకర్లు ఏకరీతి ప్రమాణాలతో తయారు చేయాలని ట్రాలీల తయారీ సైతం వేగవంతం చేయాలని ఈ విషయంలో డీలర్లు నిర్లక్ష్యం చేయవద్దన్నారు. సమావేశంలో డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు ఇన్‌చార్జి కమిషనర్‌ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. logo