బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 30, 2020 , 03:50:29

శెభాష్‌.. జగదీశ్‌..

శెభాష్‌.. జగదీశ్‌..


నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌:  జిల్లాలో నూతనంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)ను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభినందించిన మంత్రి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. వీరితోపాటు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17మున్సిపల్‌ పీఠాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడంపై ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో తనను కలిసిన మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని ఆలింగనం చేసుకుని అభినందించారు. నూతన చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులంతా మర్యాదపూర్వకంగా కలిసి బొకేలు అందజేయగా.. వారందరికీ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసినవారిలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.        


నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డిని అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి తదితరులున్నారు.


 హాలియా మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మశంకరయ్యలను అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతోపాటు జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, ఎమ్మెల్యే తనయుడు నోముల భగత్‌యాదవ్‌, తిరుమలగిరి(సాగర్‌) ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, వార్డు కౌన్సిలర్లు వర్ర వెంకట్‌రెడ్డి, నలబోతు వెంకటయ్య, అన్నెపాక శ్రీనివాస్‌, జటావత్‌ ప్రసాద్‌నాయక్‌ తదితరులున్నారు.


చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డిని అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, వైస్‌ చైర్మన్‌ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్‌లు బెల్లి సత్తయ్య, జిట్ట పద్మ, పందిరి గీత, సిలివేరు మౌనిక, నాయకులు జడల ఆదిమల్లయ్య, కర్నాటి ఉప్పలవెంకట్‌రెడ్డి, గుండెబోయిన సైదులు, వేలుపల్లి మధుకుమార్‌, కోమటిరెడ్డి రాంరెడ్డి, బొబ్బలి శివశంకర్‌రెడ్డి, వేలుపల్లి వెంకన్న, బూరుగు క్రిష్ణయ్య, తోకల నరేందర్‌రెడ్డి, పొన్నం లక్ష్మయ్య తదితరులున్నారు.


దేవరకొండ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆలంపల్లి నర్సింహను అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎండి రహత్‌ అలీ, దేవరకొండ ఎంపీపీ నల్లగాసు జాన్‌ యాదవ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వడ్త్య దేవేందర్‌ ఉన్నారు.


నందికొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కర్న అనూషారెడ్డిని అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యతోపాటు వైస్‌ చైర్మన్‌ మంద రఘువీర్‌, కౌన్సిలర్‌లు మంగ్తా, నాగశిరీష, రమేష్‌జీ, నాగరాణి, నిమ్మల ఇందిరా, ఇర్ల రామకృష్ణ, నంద్యాల శ్వేతలు, ఎన్నికల ఇన్‌చార్జి రవీందర్‌రావు, నందికొండ ఎన్నికల ఇన్‌చార్జ్‌ సందీప్‌రెడ్డి, నాయకులు కర్న శరత్‌రెడ్డి, మోహన్‌నాయక్‌, ఆదాసు విక్రమ్‌, వీరయ్య, కేరల సురేష్‌, శ్రీను తదితరులున్నారు.


నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డిని అభినందిస్తున్న మంత్రి కేటీఆర్‌, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులున్నారు.


logo