మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Jan 28, 2020 , 01:57:59

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ప్రజల మద్ధతు

టీఆర్‌ఎస్‌  ప్రభుత్వానికే   ప్రజల మద్ధతు

సూర్యాపేట టౌన్‌ : ఉద్యమ కాలంలోనే అందరి కష్టాలు తెలుసుకుని పోరాడి సాధించుకున్న తెలం గాణలో ప్రజలు నచ్చి, మెచ్చి వేసిన ఓటుతో గెలిపించుకున్న నాటి ఉద్యమ రథసారథి, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రతిపక్ష నేతలు సహా అన్ని కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.. దీంతో యావత్‌ ప్రజానీకం టీఆర్‌ఎస్‌ వెంటే ఉంటూ ఏ ఎన్నికలొచ్చినా గులాబీ జెండాకే పట్టం కడుతున్నారు.. అదే విషయాన్ని ఈ పురపాలిక ఎన్నికలతో మరోమారు రుజువు చేశారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.  సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌ చైర్మన్‌గా పుట్ట కిశోర్‌ల ఎన్నిక అనంతరం మంత్రి జగదీష్‌ రెడ్డి వారిని అభినందించి విలేకరులతో మాట్లాడారు.  జనరల్‌ మహిళ స్థానంలో దళిత మహిళకు అవకాశం కలిపించడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇది రాజకీయ చరిత్రలో పెనుమార్పుకు సంకేతమన్నారు. ముందుగానే ఈ విషయాన్ని  సీఎం కేసీఆర్‌, మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ల ఎదుట ఉంచానని.. వారి అనుమతితోనే పేట చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణకు అవకాశం కల్పించామన్నారు.  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతి కొనసాగాలన్నారు. 2014, 2018 ఎన్నికల ముందు సూ ర్యాపేటకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ఇచ్చి చేపట్టిన పనులు చాలా వరకు పూర్తికాగా కొన్ని పురోగతిలో ఉన్నాయని వీటితో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని.. అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే ఉంటూ ఓటర్లంతా ఏకమై మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి భారీ విజయం కట్టబెట్టారన్నారు.   


నేరేడుచర్ల :   టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే పట్టణ ప్రజల మద్ధతు ఉందని తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు నిరూపించారని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నేరేడుచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పల్లెలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన మాదిరిగానే టీఆర్‌ఎస్‌కు పట్టణాలను కూడా ఇదే స్థ్ధాయిలో తీర్చిదిద్దుతుందని పట్టణ ప్రజలు నమ్మి మున్సిపల్‌ ఎన్నికల్లో 95శాతం మున్సిపాలిటీలను గెలిపించారన్నారు. రాష్ట్రంలో జరుతున్న ఎన్నికల్లో కా్ంర గెస్‌ పార్టీకి వరస ఓటమి చెందుతున్న ఇంకా జ్ఞానోదయం కలగలేదన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు మూసీలో కలిపేశారన్నారు. స్ధానిక సంస్థ్ధల ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్‌ చైర్మన్లను టీఆర్‌ఎస్‌  ఏకగ్రీవంగా గెలిచుకుందాన్నారు.  129 స్థ్ధానాల్లో కేవలం 4స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌  చైర్మన్‌లను గెలిపించుకొని చావు తప్పి కన్నులోట్టపోయిన సామేతలా ఉందన్నారు. వరస ఓటమిలతో ఉత్తమ్‌కు మతి భ్రమించిందని, ఆయన శ్రేయోభిలాషులు తక్షణమే దవాఖానకు తరలిస్తే మేమే వైద్యం అందిస్తామని చలోక్తి విసిరారు.  నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నికలో ఉత్తమ్‌ పీసీపీ అధ్యక్షుడి హోదాని విస్మరించి వీధి రౌడీలా ప్రవర్తిస్తూ తమ శాసనసభ్యుడిపై అసభ్య పదజాలంతో దాడికి ప్రయత్నించడం ఆయన మతి భ్రమించిందనడానికి నిదర్శనమన్నారు.  ఎంపీలు కేవీపీ, కేశవరావులు  రాష్ట్రం ఏర్పాటైన సమయంలో వారి ఇరువురు ఒకరు తెలంగాణ, మరొకరు ఆంధ్రాకు కేటాయిస్తూ సెక్రటేరియట్‌లో గెజిట్‌ విడుదల చేయించుకున్నారని గుర్తు చేశారు. కేవీపీ ఏపీకి చెందిన ఎమ్మెల్సీ అయినందునే అధికారులు ఆయన ఓటును ఇక్కడ తిరస్కరించారన్నారు. సమావేశంలో  రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీలు బొడికంటి వెంకటేశ్వర్లు, శేరి సుభాష్‌రెడ్డిలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, రాపోలు నర్సయ్య పాల్గొన్నారు.


logo
>>>>>>