రామగిరి, మే 26: ఎంజీయూ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన 6వ సెమిస్టర్ పరీక్షల్లో 13 మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా ఆయా పరీక్షల కేంద్రాల్లోని స్కాడ్ బృందాలు డిబార్ చేసినట్లు సీవోఈ డా. జి ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు.
కాగా పరీక్షలకు 5,090మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,708మంది విద్యార్థులు హాజరుకాగా 369మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వీరిలో భువనగిరిలోని స్టాన్‌ఫర్డ్ ఉమెన్స్ కళాశాలలో 4, తిరుమలగిరి ప్రగతి డిగ్రీ కళాశాలలో 1, దేవరకొండ ఎంకేఆర్ ్రపభుత్వ డిగ్రీ కళాశాలలో 1, భవిత డిగ్రీ కళాశాలలో 1, సూర్యాపేట ఆర్కేఎల్కే డిగ్రీ కళాశాలలో 1, రాకేశ్ బీఈడీ కళాశాలలో 3, మిర్యాలగూడ హసిత ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 1 , కోదాడలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో 1 డిబార్ అయ్యారు.