సెప్టెంబర్ 8 : ఆయుష్మాన్ భారత్ జిటల్ మిషన్‌లో రిజిస్టర్ కాకపోవడంతో జిల్లా కేం ద్రంలో రెండు ప్రైవేటు దవాఖానల అనుమతి రద్దు చేసి సీజ్ చేసినట్లు డీఎంహెచ్ డాక్టర్ కోటా చలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ భవాని ఈఎన్టీ హాస్పిటల్, అజయ్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ దవాఖానల అనుమతి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రైవేటు దవాఖానలు, నర్సింగ్ హోం, రక్త పరీక్ష కేంద్రా లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఎక్స్‌రే సెంటర్లు, డెంటల్ క్లినిక్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లు విధిగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోని, ఆయుష్మాన్ భారత్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అలాగే అనుమతి కాలం పూర్తయిన ప్రైవేటు దవాఖానలు వెంటనే రెన్యువల్ చేసుకోవాలని సూచించారు
హుజూర్‌నగర్‌లో..
హుజూర్నగర్: హుజూర్‌నగర్‌లో నిబంధనలు పాటించని దివ్య నర్సింగ్ ప్రైవేట్ దవాఖానను జిల్లా వైద్యాధికారులు గురువారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మీడియా అధికారి అనంత అంజయ్యగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 6న నర్సింగ్ హోమ్‌ను డీఎంహెచ్ఓ తనిఖీ చేయగా నిబంధనలు పాటించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. దాంతో యజమాన్యానికి నోటీసులు అందజేసి గుర్తింపును రద్దు చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట మండల ఆరోగ్యవిస్తరణ అధికారి ప్రభాకర్ పాల్గొన్నారు.