
దేవరకొండ రూరల్, ఆగస్టు, 24 : మండలంలోని కొండభీమనపల్లి, పెద్దతండా, సూర్యతండా గ్రామాలను మంగళవారం సీఆర్డీ టీం సందర్శించింది. పల్లెప్రగతిలోని పీపీలు, క్రిమిటోరియం, డంపింగ్‌యార్డులను ఎస్పీఎం మురళి, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీ టీం, డీపీఓ, ఎంపీడీఓ రామకృష్ణశర్మ, ఎంపీఓ సీవీఎన్రావు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు.
పెద్దవూరలో..
మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనులను సీఆర్డీ టీం సభ్యుడు రబ్బానీ బాషా మంగళవారం పరిశీలించారు. పాల్తీ తండా, కుంకుడు చెట్టు తండాల్లో ఈజీఎస్ ట్రెంచస్ వర్క్స్, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, క్రిమిటోరియం, హార్టికల్చర్ పనులను పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ దుబ్బా శ్యామ్, ఎంపీఓ విజయకుమారి, ఏపీఓ వెంకటేశ్వర్లు, ఈసీ కొండయ్య, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు పాల్గొన్నారు.
మండలం పరిధిలోని రాయినిపాలెం కాల్వపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పనులను రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ పంచాయతీరాజ్ ఈఈ నరూపరాణి పరిశీలించి మాట్లాడారు. ఆమె వెంట ఎంపీడీఓ దేవిక, పీఆర్ ఏఈ చిల్లంచెర్ల ఆదినారాయణ, ఏపీఓ శిరీష, టెక్నికల్ అసిస్టెంట్ పురుషోత్తం, ఆయా గ్రామాల కార్యదర్శులున్నారు.
పని గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలి : జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి
మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు సంబంధించి రికార్డుల నిర్వహణతో పాటు ఆయా ప్రదేశాల్లో పని గుర్తింపు బోర్డులను ఏర్పాటు చేయాలని జడ్పీసీఈఓ వీరబ్రహ్మచారి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 27న ఉపాధి హామీకి సంబంధించి కేంద్ర బృందం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.