శనివారం 19 సెప్టెంబర్ 2020
Nagarkurnool - Sep 07, 2020 , 03:19:13

. ప్రకృతి అందం.. అమ‌ర‌గిరి సొంతం

. ప్రకృతి   అందం.. అమ‌ర‌గిరి సొంతం

చుట్టూ కొండలు.. ప్రకృతి  రమణీయ దృశ్యాలు.. పక్షుల కిలకిల రావాలు.. పక్కనే కృష్ణమ్మ పరవళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే నల్లమల అందాలు వర్ణణాతీతం. కొల్లాపూర్‌ సమీపంలోని అమరగిరి అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. 

- కొల్లాపూర్‌


ప్రకృతి సోయమంతా అక్కడే 

రాశి పోసి ఉందా.. అన్నట్టుగా ఉంటుంది నల్లమల అటవీ ప్రాంతంలోని అమరగిరి అందాలు. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన వర్ణచిత్రమా అనిపిస్తోంది. పచ్చదనం చీరను చుట్టుకున్న వనదేతకు జలతిలకంలా ప్రతిబింబిస్తూ పర్యాటకులను కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్నది. ఇక్కడి ప్రకృతి అందాల మధ్యన కృష్ణమ్మ పరవళ్లు చూస్తే మంత్రముగ్ధులు కావాల్సిందే. తారురోడ్డుకు ఇరువైపులా స్వాగతించే వృక్షాలు.. పర్యాటకుల తనువు.. మనసు దోచుకుంటుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సరిహద్దులో కృష్ణానది తీరంలో మనసుదోచే ప్రకృతి అందాలు, చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటకరంగం కొల్లాపూర్‌కు సొంతం. 800 మీటర్ల ఎత్తైన కొండపై వెలిసిన అంకాళమ్మ కోట ఆలయం, దిగువన చీమలతిప్ప ద్వీపం(దీనిపై 60 కుటుంబాలు ఆంధ్రా జాలర్లు గుడిసెల్లో నివాసం) అటు నుంచి ఎర్రబండ, అమరులగిరి ద్వీపకల్పం, మల్లయ్యసెల ఆలయం, సోమశిల, మంచాలకట్ట, జటప్రోలు వరకు సోమేశ్వరాలయం, రామతీర్థాలయం, మదనగోపాలస్వామి ఆలయాలు ఇలా.. మరెన్నో ఉన్నాయి. నదీ జలాలపై టూరిజం లాంచీ ప్రయాణంలో పర్యాటకులు ఆహ్లాదకరంగా విహరిస్తూ కృష్ణమ్మ అందాలు వీక్షించవచ్చు. 

 


logo